తస్లీమా వీసా పొడిగింపునకు కేంద్రం హామీ! | centre assures taslima nasreen visa extention | Sakshi
Sakshi News home page

తస్లీమా వీసా పొడిగింపునకు కేంద్రం హామీ!

Aug 3 2014 2:47 AM | Updated on Sep 2 2017 11:17 AM

తస్లీమా వీసా పొడిగింపునకు కేంద్రం హామీ!

తస్లీమా వీసా పొడిగింపునకు కేంద్రం హామీ!

బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు.

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. భారత్‌లో నివసించేందుకు తనకు ఏడాది కాలవ్యవధిగల వీసా మంజూరు చేయాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం బుధవారం తిరస్కరించి ఆగస్టు 1 నుంచి కేవలం రెండు నెలల తాత్కాలిక నివాసానికి అంగీకరించిన నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు ఆయనతో భేటీఅయ్యారు.

సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో తన వీసాను పొడిగించాలని ఆమె రాజ్‌నాథ్‌ను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ గురించి తస్లీమా ట్వీట్ చేస్తూ రాజ్‌నాథ్‌కు తన పుస్తకం ‘వో అంధేరే దిన్’ (ఆ చీకటి రోజులు)ను అందించానని...దీనికి ఆయన బదులిస్తూ ‘మీ చీకటి రోజులు ముగిసిపోతాయి’ అని అన్నారని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement