1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు | Sakshi
Sakshi News home page

1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

Published Mon, Sep 16 2019 7:38 AM

Central Government Decided To Setup 1023 Fast Track Courts Nationwide - Sakshi

న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 1.66 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.  ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని వెల్లడించింది. వీటిలో 389 కోర్టులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయని తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ. 767.25 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 

Advertisement
Advertisement