73 శాతం మంది మోదీకే జైకొట్టారు!

C Voter Survey India China Clash 73 Percent Trust NDA Government - Sakshi

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకముందని 73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 17 శాతం ప్రజలు విపక్షాలపై నమ్మకం ఉందన్నారు. చైనాతో ఘర్షణలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానంపై సీఓటర్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక సర్వేలో పాల్గొన్న 61 శాతం మంది రాహుల్ గాంధీపై నమ్మకం లేదన్నారు. జాతీయ భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకం ఉందని  73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో 14 శాతం మాత్రమే రాహుల్ గాంధీ పై నమ్మకం ఉందని అన్నారు.
(చదవండి: ఆ వార్త అవాస్తవం: చైనా)

ఇక 68 శాతం మంది చైనా వస్తువులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరో 31 శాంత మంది చైనా వస్తువులను కొనడంలో అభ్యంతరం లేదని చెప్పారు. పాకిస్థాన్ కన్నా చైనాయే  భారత్‌కు పెద్ద సమస్య అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. చైనా వైఖరి భారత్‌కు ప్రధాన ఆందోళన అని 68 శాతం మంది తెలిపారు. 32 శాతం మంది పాకిస్తాన్ ప్రమాదకరమని అన్నారు. గల్వాన్  హింసాత్మక ఘటనల్లో భారత్ ఇంకా చైనాకు గట్టి జవాబు ఇవ్వలేదని  60 శాతం మంది అభిప్రాయపడ్డారు.
(చదవండి: భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top