కోళ్లకు టికెట్‌ లేదా.. అయితే ఫైన్‌ కట్టు !

Bus Ticket Fine For Three Hens in Karnataka - Sakshi

మూడు కోళ్లకు రూ. 500 జరిమానా

బొమ్మనహళ్లి : కోళ్లకు టికెట్‌ తీసుకోలేదని జరిమానా విధించిన ఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని కోడు నుంచి మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. నిజాయితీగా టికెట్‌ తీసుకున్నాడు. ఇంతలో కొంత దూరం ప్రయాణం అనంతరం తనిఖీ బృందం వచ్చి టికెట్లు తనిఖీ చేస్తుండగా కోళ్లకు టికెట్‌ తీసుకోలేదని గుర్తించి సదరు ప్రయాణికుడికి రూ. 500 జరిమానా విధించారు. కేఎస్‌ఆర్టీసీలో ప్రాణులు, ఇతర పక్షులను తీసుకువెళ్లే సమయంలో తప్పకుండా అర టికెట్‌ తీసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో విషయం తెలియని వ్యక్తి జరిమానా కట్టి కోళను వెంట తెచ్చుకున్నాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top