ప్రధాని పర్యటనకు ముందు బాంబు స్వాధీనం | Bomb seized in Manipur | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు ముందు బాంబు స్వాధీనం

Feb 25 2017 6:22 AM | Updated on Aug 21 2018 9:33 PM

ప్రధాని పర్యటనకు ముందు బాంబు స్వాధీనం - Sakshi

ప్రధాని పర్యటనకు ముందు బాంబు స్వాధీనం

ఎన్నికల ప్రచారం కోసం మణిపూర్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక హ్యాండ్‌ గ్రెనేడ్, బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంఫాల్‌: ఎన్నికల ప్రచారం కోసం మణిపూర్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక హ్యాండ్‌ గ్రెనేడ్, బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లో ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఆరు రెబల్‌ గ్రూపులకు సంబంధించిన అత్యున్నత కమిటీ నేడు పూర్తిస్థాయి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ర్యాలీ చేపట్టే పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలోని లాంజింగ్‌ అచౌబా మైదానానికి 9 కిలోమీటర్ల దూరంలోని బీజేపీ అభ్యర్థి సుభచంద్ర నివాసానికి దగ్గరలో ఒక చైనీస్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తోబాల్‌ జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త నివాసానికి సమీపంలో మరో బాంబును గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement