'విదేశాలకు వెళ్లాలనుకుంటే హైకోర్టును అడగండి' | blackbuck shooting case: Supreme court sets aside high court order staying Salman Khan's conviction | Sakshi
Sakshi News home page

'విదేశాలకు వెళ్లాలనుకుంటే హైకోర్టును అడగండి'

Jan 14 2015 1:05 PM | Updated on Sep 2 2018 5:20 PM

'విదేశాలకు వెళ్లాలనుకుంటే హైకోర్టును అడగండి' - Sakshi

'విదేశాలకు వెళ్లాలనుకుంటే హైకోర్టును అడగండి'

విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయితే సల్మాన్ ఖాన్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయితే సల్మాన్ ఖాన్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందవచ్చని సుప్రీంకోర్టు  సూచించింది. రాజస్తాన్‌ హైకోర్టు స్టే ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ  రాజస్తాన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును తిరిగి పరిశీలించాలని  రాజస్తాన్‌ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.  శిక్ష నిలుపుదల చేస్తే సల్మాన్‌కు ఎటువంటి నష్టం కలగదనే విషయాన్ని హైకోర్టులోనే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రాజస్తాన్‌ ప్రభుత్వానికి సూచించింది.  

కృష్ణజింకలను వేటాడినట్టు 1998లో సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసలు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు చెప్పింది.  శిక్షను సవాల్‌ చేస్తూ సల్మాన్‌ ..రాజస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించారు.  హైకోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పుపై విధించింది. ఇప్పుడు  అటుతిరిగి ఇటు తిరిగి మళ్లీ ఈ కేసు రాజస్తాన్‌ హైకోర్టు ముందుకు వచ్చింది. గతేడాది నవంబర్‌ ఐదున సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనలు ముగిశాయి.  జస్టిస్‌ ఎస్జే ముఖోపాధ్యాయ,  జస్టిస్‌ ఏకే గోయెల్‌  ఈ కేసులో వాదనలు విన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement