వీడియో : కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ

BJP MP Smriti Irani Lends A shoulder To Mortal Remains Of Surendra singh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కార్యకర్త, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌ సరేంద్రసింగ్‌ అంతిమయాత్రలో అమేథీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన బీజేపీ నేత స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సురేంద్ర సింగ్ భౌతికకాయాన్ని స్మృతి ఇరానీ స్వయంగా తన భుజాలపై మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

(చదవండిస్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత)

బరూలియా గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్‌ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top