హోలీ వేడుకల్లో విషాదం : ఎమ్మెల్యేపై కాల్పులు | BJP MLA Yogesh Verma Shot At During Holi Celebration | Sakshi
Sakshi News home page

హోలీ వేడుకల్లో విషాదం : ఎమ్మెల్యేపై కాల్పులు

Mar 21 2019 7:32 PM | Updated on Mar 28 2019 8:41 PM

BJP MLA Yogesh Verma Shot At During Holi Celebration - Sakshi

హోలీ వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. బీజేపీ కార్యాలయం‍లో గురువారం జరిగిన హోలీ వేడుకల్లో లఖీంపూర్‌ ఖేరీ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్‌ వర్మపై కాల్పులు కలకలం రేపాయి. వర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి గట్టెక్కారని సమాచారం. లఖీంపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్‌ వర్మపై హోలీ వేడుకల్లో దుండగుడు కాల్పులు జరిపాడని, కాల్పుల్లో ఆయన కాలికి బుల్లెట్‌ గాయాలయ్యాయని జిల్లా ఎస్పీ పూనం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వర్మ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్పీ పూనం వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో కొంతమందితో ఎమ్మెల్యే ముచ్చటిస్తున్న క్రమంలో వాగ్వాదం చేసుకోవడంతో ఆయనపై కాల్పులు జరిపారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే​ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని లఖీంపూర్‌ జిల్లా మేజిస్ర్టేట్‌ ఎస్‌ సింగ్‌ చెప్పారు. ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు త్వరలోనే అరెస్ట్‌ చేస్తారని సింగ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement