87మంది నేతలపై బీజేపీ వేటు | BJP expels 87 leaders, workers in UttarPradesh | Sakshi
Sakshi News home page

87మంది నేతలపై బీజేపీ వేటు

May 11 2017 12:54 PM | Updated on Mar 29 2019 9:31 PM

అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 87మంది భారతీయ జనతా పార్టీ నేతలపై వేటు పడింది.

లక్నో : అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 87మంది భారతీయ జనతా పార్టీ నేతలపై వేటు పడింది. వీరందర్ని ఆరేళ్లపాటు సస్పెన్షన్‌ చేస్తున్నట్లు బీజేపీ గురువారం ప్రకటించింది.  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకుగాను వీరిపై వేటు వేసినట్లు ఆ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ విద్యా సాగర్‌ సోన్‌కర్‌ వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని పలువురు నేతలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులపైనే పోటీ చేయగా, మరికొందరు ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చారు.దీంతో క్రమశిక్షణా చర్య కింద వారిపై వేటు పడింది.

ఈ నిర్ణయానికి  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆమోదం తెలిపారు. కాగా బహిష్కరణకు గురైనవారిలో కపిల్‌ దేవ్‌ కొరి (రాంపూర్‌), వీకె షైనీ (మొరాదాబాద్‌), ఇంద్రదేవ్‌ సింగ్‌ (బిజ్నోర్‌), శాంతి స్వరూప్‌ శర్మ (బులంద్‌షహర్‌), చంద్రశేఖర్‌ రావత్‌ (హత్రాస్‌), ఆశిష్‌ వశిష్ట​ (బాగ్పాట్‌), ప్రతిభా సింగ్‌, మహేశ్‌ నారాయణ్‌ తివారీ, నిర్మల్‌ శ్రీవాత్సవ, వైభవ్‌ పాండే, విద్యాభూషణ్‌ ద్వివేది (గోండా) తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement