బిల్లుకు ఆమోదం తెలిపిన బిహార్‌ క్యాబినెట్‌

Bihar Cabinet Approves Job for Kin of State Soldiers Killed in Galwan Valley Clash - Sakshi

పట్నా: ఈ నెల 15న గల్వాన్‌ వ్యాలీలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన జవానుల కుటుంబాలకు సాయం చేసేందుకు బిహార్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాటి ఘర్షణలో అసువులు బాసిన రాష్ట్రానికి చెందిన అమర జవాన్ల కుటంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును బిహార్‌ క్యాబినేట్‌ ఆమోదించింది. చైనాతో గాల్వన్‌ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే.

వీరిలో తెలంగాణకు చెందిన కల్నల్‌ బి సంతోష్‌ బాబు కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సంతోష్‌బాబుతో పాటు నాటి ఘర్షణలో చనిపోయిన మిగతా జవాన్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం రూ. 10లక్షల ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. (వాజ్​పేయి చాణక్యం.. చైనాకు గుణపాఠం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top