భారత్‌-చైనా సరిహద్దు సమీపంలో కూలిన బ్రిడ్జి

Bailey Bridge Collapsed In Uttarakhand Near India China Border - Sakshi

డెహ్రాడూన్‌: ప్రొక్లెయినర్‌ను తీసుకుని ఓ భారీ వాహనం వంతెనపైనుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. వాహనంతోపాటు అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ 40 అడుగుల లోతులో పడిపోయారు. గాయాలపాలైన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలోని మున్సియారి ప్రాంతంలో సోమవారం జరిగింది. రివులేట్ నదిపై 2009లో ఈ వంతెన నిర్మించారు. ఇది భారత్‌-చైనా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
(చదవండి: పతంజలి కరోనా మందుకు బ్రేక్!)

వంతెన సామర్థ్యం 18 టన్నులు ఉండగా.. ప్రొక్లెయినర్‌, లారీతో కలిపి మొత్తం బరువు 26 టన్నులకు చేరిందని పోలీసులు తెలిపారు. వంతెన బలహీనంగా ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నప్పటికీ లారీని అలానే పోనిచ్చారని వెల్లడించారు. వాహన డ్రైవరుపై కేసు నమోదా చేశామని అన్నారు.  ఇక డ్రైవర్‌ పరిస్థితి నిలడకగా ఉండగా, క్లీనర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసత్రి వర్గాలు తెలిపాయి. వంతెన కూలిపోవడంతో దాదాపు 15 ఊళ్లకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కొత్త వంతెన నిర్మించాలంటే రెండు వారాలు పడుతుందని జిల్లా అధికారులు తెలిపారు. 
(చదవండి: మార్గమధ్యలో కరోనా.. అంతా పరుగో పరుగు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top