విమానాన్ని అత్యవసరంగా దించినా.. | baby dies dispite emergency landing of flight | Sakshi
Sakshi News home page

విమానాన్ని అత్యవసరంగా దించినా..

Sep 22 2016 11:48 AM | Updated on Sep 4 2017 2:32 PM

విమానాన్ని అత్యవసరంగా దించినా..

విమానాన్ని అత్యవసరంగా దించినా..

విమానంలో వెళ్తున్న ఓ చిన్నారి ఆరోగ్యం ఉన్నట్టుండి విషమించింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే దించేశారు. అయినా కూడా ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.

విమానంలో వెళ్తున్న ఓ చిన్నారి ఆరోగ్యం ఉన్నట్టుండి విషమించింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే దించేశారు. అయినా కూడా ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్తున్న 6ఇ 202 ఇండిగో విమానాన్ని మధ్యలో రాయ్‌పూర్‌లోనే అత్యవసరంగా దించారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి గుండెజబ్బుతో బాధపడుతోంది.

ఆమెను చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్తున్నారు. దారిలోనే ఆమె ఆరోగ్యం విషమించింది. దాంతోవెంటనే చికిత్స అందించేందుకు వీలుగా విమానాన్ని దారి మళ్లించి రాయ్‌పూర్‌లో దించారు. ఇందుకోసం ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడి ఏర్పాట్లు కూడా చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా.. చిన్నారి ప్రాణాలు మాత్రం నిలబడలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement