అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇద్దరు బీజేపీ పార్లమెంటు సభ్యులు సహా ఆరుగురు నిందితులకు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
న్యూఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇద్దరు బీజేపీ పార్లమెంటు సభ్యులు సహా ఆరుగురు నిందితులకు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. బీజేపీ ఎంపీలు సాక్షి మహారాజ్, బ్రిజ్ భూషణ్ శరణ్‌లతోపాటుగా, మరో నలుగురికి వారెంట్లు జారీ చేస్తూ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శశిమౌలి తివారీ ఉత్తర్వు జారీ చేశారు.
నిందితులు అమర్‌నాథ్ గోయల్, జై భగవాన్ గోయల్, పవన్ కుమార్ పాండే, రాంచంద్ర ఖత్రీలకు కూడా వారెంట్లు జారీ అయ్యాయి. సోమవారం కేసు విచారణకు నిందితులుగానీ, వారి న్యాయవాదులుగానీ కోర్టుకు హాజరు కాలేదు. నిందితులంతా ఈ నెల 19న విచారణకు హాజరుకావాలంటూ, వారు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని సీబీఐని కూడా ప్రత్యేక కోర్టు ఆదేశించింది.