గనుల నుంచి రాష్ర్టాలు ఘనమైన రాబడి ఆర్జించనున్నాయి.
ఆ రాష్ర్టాలకు రూ 1.5 లక్షల కోట్ల రాబడి
Sep 20 2017 5:26 PM | Updated on Sep 21 2017 1:39 PM
	సాక్షి,న్యూఢిల్లీః గనుల నుంచి రాష్ర్టాలు ఘనమైన రాబడి ఆర్జించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖనిజ సంపద అపారంగా ఉన్న రాష్ర్టాలకు గనుల వేలం ద్వారా రూ 1.5 లక్షల కోట్లు సమకూరుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆయా రాష్ర్ట ప్రభుత్వాల ఖజానాకు 21 గనుల వేలం ద్వారా రూ 73,000 కోట్లు సమకూరాయని పేర్కొన్నాయి.
	 
					
					
					
					
						
					          			
						
				
	మరో 54 గనుల వేలం ద్వారా రూ 2 లక్షల కోట్ల రాబడి అంచనా వేస్తున్నామని, ఇందులో రూ 1.5 లక్షల కోట్లు రాష్ర్టాల ఖాతాకు వెళతాయని గనుల కార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు.ఈసారి సున్నపురాయి, ముడిఇనుము, బంగారు గనులు వేలంలో పెద్దసంఖ్యలో పాల్గొంటాయని చెప్పారు. ఐబీఎం, జీఎస్‌ఐ, సహా ఎంఎస్‌టీసీ, ఎంఈసీఎల్ వంటి పలు పీఎస్‌యూల సహకారంతో ఇప్పటికే వేలం ప్రక్రియను గనుల శాఖ ప్రారంభించిందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
