ఆ రాష్ట్రంలో ఉద్యోగం సాధించాలంటే..

Assam Government Ready For Language Clause In Government Jobs - Sakshi

అసోం: అసోంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాయడం, మాట్లాడడం కచ్చితంగా రావాల్సిందే. సర్బానంద సోనావాల్‌ ప్రభుత్వం తాజా నిబంధనలను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కేవలం అసోం భాషలో మాట్లాడడం సరిపోదని, రాయడం కూడా వచ్చి ఉండాలని తెలిపారు. అసోం భాషను కాపాడుకోవడంలో భాగంలోనే ఈ నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు.

తన కుమారుడు వేరే రాష్ట్రంలో చదువుతున్నాడని.. అతడు అసోం భాషలో మాట్లాడగలడని, కానీ రాయడం రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందలేడని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని అన్నారు. పదవ తరగతి వరకు అసోం భాషను బోధించాలనే నిబంధనను పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి అసోంని రాష్ట్ర భాషగా ఎప్పటికి కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top