సోనియా, రాహుల్ కు జైట్లీ ఆహ్వానం | Arun Jaitley invite Sonia, Rahul | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్ కు జైట్లీ ఆహ్వానం

Nov 18 2015 3:12 PM | Updated on Aug 20 2018 5:16 PM

సోనియా, రాహుల్ కు జైట్లీ ఆహ్వానం - Sakshi

సోనియా, రాహుల్ కు జైట్లీ ఆహ్వానం

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. తన కుమార్తె సోనాలి వివాహానికి రావాలని వారిని ఆహ్వానించారు. డిసెంబర్ లో జైట్లీ కుమార్తె వివాహం జరగనుంది. తన తండ్రిలాగే జైట్లీ కుమార్తె కూడా న్యాయవాది వృత్తిని చేపట్టారు.

కాగా, రెండు రోజుల క్రితం సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ.. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిశారు. సుమిత్రా మహాజన్ మనవరాలు ప్రియాంక గాంధీని కలవాలని ఆశ పడడంతో వీరు భేటీ అయినట్టు సమాచారం. మర్యాదపూర్వకంగా వీరు కలిశారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement