మాటలు రావడం లేదు: ప్రధాని మోదీ | Anguished beyond words on loss of lives due to the derailing of Patna-Indore express: PM Modi | Sakshi
Sakshi News home page

మాటలు రావడం లేదు: ప్రధాని మోదీ

Nov 20 2016 8:04 AM | Updated on Sep 4 2017 8:38 PM

మాటలు రావడం లేదు: ప్రధాని మోదీ

మాటలు రావడం లేదు: ప్రధాని మోదీ

పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. తన బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించారు.

సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రమాదం జరగటానికి గల కారణాల గురించి అడిగారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement