
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు
సాక్షి, లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఊరట లభించింది. 2007 గోరఖ్‌పూర్ అల్లర్లలో యోగి పాత్రపై తిరిగి విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలని పర్వేజ్ పర్వాజ్, అసద్ హయత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007 జనవరిలో జరిగిన ఈ ఘర్షణల్లో పది మంది మరణించారు. దాదాపు పదేళ్ల కిందట చోటుచేసుకున్న మతఘర్షణలకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రాసిక్యూషన్‌కు తాము అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించిన కొద్ది మాసాల అనంతరం అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ తుది నివేదికను ప్రత్యేక కోర్టుకు త్వరలో సమర్పిస్తుందని, ఈ దశలో సీఎం ప్రాసిక్యూషన్‌కు తాము అనుమతించబోమని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో యూపీ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాహుల్ భట్నాగర్ పేర్కొన్నారు.