120 రోజులు ముందుగానే రైల్వే రిజర్వేషన్ | advance reservation period extended to 120 days | Sakshi
Sakshi News home page

120 రోజులు ముందుగానే రైల్వే రిజర్వేషన్

Feb 26 2015 1:03 PM | Updated on Sep 2 2017 9:58 PM

120 రోజులు ముందుగానే రైల్వే రిజర్వేషన్

120 రోజులు ముందుగానే రైల్వే రిజర్వేషన్

రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైలు ప్రయాణికులకు ఓ కొత్త వరం ప్రకటించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఇపుడున్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు.

రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైలు ప్రయాణికులకు ఓ కొత్త వరం ప్రకటించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఇపుడున్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. ఇంతకుముందు 90 రోజుల ముందుగానే ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ తర్వాత దాన్ని 60 రోజులకు తగ్గించారు.

దాంతో 60 రోజుల వరకు ఆగిన తర్వాత మాత్రమే ముందుగా ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చేది. తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటనతో.. 120 రోజులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఇది కొంత మందికి వరంగానే పరిణమిస్తుంది గానీ.. కొందరికి మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్లకు బాగా ముందే టికెట్లు మొత్తం బుక్ అయిపోవడంతో.. తర్వాత చేసుకుందామని ఆగేవాళ్లకు టికెట్లు దొరికే అవకాశం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement