‘కేరళకు లేవన్నారు.. స్టాచ్యూకి రూ. 3000 కోట్లు ఎక్కడివి’ | Actor Prakash Raj Fires On Modi Over Sardar Patel Statue | Sakshi
Sakshi News home page

Nov 9 2018 5:36 PM | Updated on Nov 9 2018 5:36 PM

Actor Prakash Raj Fires On Modi Over Sardar Patel Statue - Sakshi

బెంగళూరు : వరదలతో అతాలకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పీఎం విగ్రహం నిర్మాణం కోసం మాత్రం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇలాంటి విచక్షణ లేని నాయకున్ని మీరు ఎక్కడైనా.. ఎప్పుడైనా చూశారా అంటూ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మండిపడ్డారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడాన్ని తప్పు పడుతూ ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్‌ చేశారు. కేరళను వరదలు ముంచేత్తినప్పుడు ముందు కేవలం 100 కోట్ల రూపాయలు.. ఆపై రూ. 500 కోట్ల సాయాన్ని ప్రకటించిన మోదీ సర్దార్‌ పటేల్‌ విగ్రహం కోసం ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విచక్షణ జ్ఞానం ఉన్న నాయకుడేవరైనా ఇలాంటి పని చేస్తారా అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రకాష్‌ రాజ్‌ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement