పోలీసు జీపులోనే నిందితుడి హత్య | accused Murder in police jeep | Sakshi
Sakshi News home page

పోలీసు జీపులోనే నిందితుడి హత్య

Feb 25 2017 2:33 AM | Updated on Aug 21 2018 7:18 PM

పోలీసులు జీపులో కోర్టుకు తీసుకెళుతున్న వ్యక్తిని 10 మంది దుండగులు దాడి చేసి హత్య చేసిన సంఘటన తిరునెల్వేలిలో శుక్రవారం చోటుచేసుకుంది.

సేలం/కేకే.నగర్‌(చెన్నై): పోలీసులు జీపులో కోర్టుకు తీసుకెళుతున్న వ్యక్తిని 10 మంది దుండగులు దాడి చేసి హత్య చేసిన సంఘటన తిరునెల్వేలిలో శుక్రవారం చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లా పుల్లావెలికి చెందిన సింగారం ఓ హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం పాళయంకోట సెంట్రల్‌ జైల్లో ఉన్న ఇతను శుక్రవారం కేసుకు సంబంధించి కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

ఎస్‌ఐ, మరో ముగ్గురు పోలీసులు ఎస్కార్టుగా సింగారంను జీపులో తీసుకెళుతున్నారు. పాళయంకోట కేటీసీ నగర్‌ చెక్‌పోస్టు సమీపంలో వెళుతుండగా వీరి జీపును కారులో వచ్చిన 10 మంది అడ్డుకున్నారు. వెంటనే పోలీసుల కళ్లల్లో కారం చల్లి వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో సింగారంపై దాడి చేసి హత్యచేసి, తర్వాత జీపును ధ్వంసం చేసి పారిపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement