Sakshi News home page

ఇదొక బంగ్లాదేశీ భాయ్జాన్ కథ

Published Thu, Jun 30 2016 10:06 AM

ఇదొక బంగ్లాదేశీ భాయ్జాన్ కథ

న్యూఢిల్లీ: ఈ ఈద్ పండుగ ఓ ముస్లిం కుటుంబంలో మరింత సంతోషాన్ని తెస్తోంది. ఏడేళ్ల కిందట తప్పిపోయిన సోనూ అనే తమ కుమారుడు కళ్లముందుకొస్తుండటంతో ఆ ఇంట్లో పండుగవాతావరణం రెట్టింపయింది. ఇది కూడా ఓ రకంగా భజరంగీ భాయ్ జాన్లాంటి ఛాయలున్న కథే. కాకపోతే ఈసారి భాయ్జాన్ మాత్రం బంగ్లాదేశీయుడు. బాబు మాత్రం తప్పిపోవడం కాకుండా తప్పించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని న్యూ సెమాపురి అనే ప్రాంతంలో మహబూబ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.

అతడికి ఓ రెండుగదుల నివాసం ఉంది. మెకానిక్ గా పనిచేస్తున్న అతడి ఇంట్లోకి అద్దెకు వచ్చిన ఓ మహిళ ధీన పరిస్థితి చూసి ఆమెకు అద్దె లేకుండానే ఓ గది ఇచ్చాడు. తొలుత చిన్నాచితక పనిచేసుకుంటూ ఉంటున్న ఆమె 2009 ఆగస్టు నెలలో మహబూబ్ ఆరేళ్ల కుమారుడు సోనూను ఎత్తుకొని పారిపోయింది. ఆమె కోసం ఎంతగాలించినా ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. చాలా కాలంపాటు కేసును విచారించిన పోలీసులు ఇక చేసేది లేక కేసు మూసి వేశారు. తమ పిల్లాడు చనిపోయాడనుకొని బాధపడుతూ మహబూబ్ కుటుంబ సభ్యులు తమను తాము తమాయించుకున్నారు.

ఆనందం నింపిన ఒక్క ఫోన్ కాల్..
ఇలా ఉండగా, ఒక రోజు బంగ్లాదేశ్ నుంచి జమాల్ ముసా అనే వ్యక్తి మహబూబాకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయి నా వద్దే భద్రంగా ఉన్నాడంటూ ఈ మధ్య ఫోన్ చేశాడు. దీంతో మహబూబ్ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది. ఇంతకీ జమాల్ ఎవరంటే అతనో మెకానిక్. ఒక రోజు తీవ్రంగా ఓ మహిళ చేతిలో హింసకు గురవుతున్న బాలుడిని చూశాడు. అతడికి జాలేసి దగ్గరకు వెళ్లి కాసేపు మాట్లాడగా.. అసలు విషయం ఆ బాలుడు చెప్పాడు. తాను ఢిల్లీకి చెందిన వాడినని, తనను ఆ మహిళ ఎత్తుకొచ్చిందని చెప్పాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ముసా ఎలాగైనా ఆ బాలుడిని వారి కుటుంబం దరిచేర్చాలనుకున్నాడు.

అధికారులను, మీడియాను సంప్రదించి ఒకసారి మహబూబా కుటుంబంతో కలిశాడు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. బాలుడి డీఎన్ఏ తన తల్లి డీఎన్ఏతో సరిపోలడంతో ఇక ఆ బాలుడిని తీసుకొచ్చేందుకు రంగం సిద్దమైంది. ఈ రోజు(గురువారం) ఆ బాలుడు తన కుటుంబాన్ని ఏడేళ్ల తర్వాత కలుసుకోనున్నాడు. అలా మహబూబా కుటుంబంలో ముసా సంతోషాన్ని నింపాడు.

Advertisement

What’s your opinion

Advertisement