వివాహేతర సంబంధం ప్రాణం తీసింది! | a Man commits suicide due to her married lover in UP | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం ప్రాణం తీసింది!

Sep 8 2016 1:12 PM | Updated on Aug 29 2018 8:38 PM

వివాహితతో సంబంధం కొనసాగించి, చివరికి ఆమె నిరాకరించిందన్న కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వివాహితతో  సంబంధం కొనసాగించి, చివరికి ఆమె నిరాకరించిందన్న కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోను(22) అనే యువకుడు బెగరాజ్ పూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే అతడికి స్థానికి మెడికల్ కాలేజీలో పనిచేసే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆమెను కలవాలని ఉందని బుధవారం ఉదయం కబురు పంపాడు.

సోనును కలిసేందుకు ఆమె నిరాకరించిందింది. తనకు కావాలనే దూరంగా ఉండాలని ప్రియురాలు చూస్తుందని మనస్తాపానికి లోనైయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సాయంత్రం సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోను మృతికి కారణమని భావిస్తున్న ఆ వివాహిత, ఆమె భర్త, కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. సోను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక హత్యకు గురయ్యాడా అని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement