breaking news
unmaritual relations
-
భార్యను కిరాతకంగా హత్యచేసి.. భార్య చెల్లికే ఫోన్ చేసి..
హైదరాబాద్, ఉప్పల్: కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అనుమానంతో కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలుకానగర్ శనివారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన పోతపాటి సురేష్ (43), జెస్సికా (35) దంపతులు చిలుకానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. సురేష్ సఫిల్‌గూడలోని ట్రావెల్స్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తుండగా జెస్సికా తార్నాకలో ఒక ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది.వీరికి ఒక కూతురు (9) ఉంది. తరచూ భార్యాభర్తలు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన సురేష్ భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ పెద్దగా అరుచుకున్నారు. ఈ క్రమంలో జెస్సికాను కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అది వంగిపోవడంతో మరో కత్తి తీసుకుని హత్య చేశాడు.శరీరంపై దాదాపు 8 చోట్ల కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం వరకు అక్కడక్కడే తిరుగుతూ.. చివరికి జెస్సికా సోదరికి హత్య చేసిన విషయం చెప్పాడు. ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్దే పార్క్ చేసి పక్కనే ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని పారిపోయాడు. ఉప్పల్ ఏసీపీ వెంకటరెడ్డి హత్య జరిగిన తీరును కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
భర్త వివాహేతర సంబంధాలు.. భార్య ఆత్మహత్య
జీడిమెట్ల: భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సూరారం టీఎస్ఐఐసీ కాలనీకి చెందిన సత్తిరెడ్డి కుమార్తె నీరజా(26), అల్వాల్‌కు చెందిన సుచిన్రెడ్డి లకు ఫిబ్రవరి 16 న వివాహం జరిగింది. సుచిన్రెడ్డికి పెళ్లికి ముందే పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. పెళ్లయిన తరువాత కూడా అతను తన వైఖరి మార్చుకోకపోగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను నీరజకు ఫోన్ చేసి తిట్టడంతో మనస్థాపానికి గురైన ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సత్తిరెడ్డి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టేజీ మీద భర్తను చితకబాదిన భార్య!
-
స్టేజీ మీద భర్తను చితకబాదిన భార్య!
సాధారణంగా ఎక్కడైనా భర్త తనను మోసం చేశాడంటూ అతడి భార్య ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు గొడవ చేయడం, పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కాస్త వెరైటీ ఘటన చోటుచేసుకుంది. స్టేజీపై పుస్తకావిష్కరణ జరుగుతుండగా భర్తను పట్టుకుని ఓ వివాహిత చితకబాదింది. నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి... చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో మంగళవారం రాత్రి పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుండగా, స్టేజీపైకి ఎక్కిన ఓ వివాహిత తన భర్తను అందరూ చూస్తుండగానే చితకబాదింది. ఆమెతో పాటు మరికొంత మంది వ్యక్తులు వేదిక మీద ఆ వ్యక్తి మీద దాడి చేశారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. తన పేరు సూర్యప్రభ అని ఆ వివాహిత పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహేతర సంబంధం ప్రాణం తీసింది!
వివాహితతో సంబంధం కొనసాగించి, చివరికి ఆమె నిరాకరించిందన్న కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోను(22) అనే యువకుడు బెగరాజ్ పూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే అతడికి స్థానికి మెడికల్ కాలేజీలో పనిచేసే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆమెను కలవాలని ఉందని బుధవారం ఉదయం కబురు పంపాడు. సోనును కలిసేందుకు ఆమె నిరాకరించిందింది. తనకు కావాలనే దూరంగా ఉండాలని ప్రియురాలు చూస్తుందని మనస్తాపానికి లోనైయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సాయంత్రం సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోను మృతికి కారణమని భావిస్తున్న ఆ వివాహిత, ఆమె భర్త, కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. సోను ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక హత్యకు గురయ్యాడా అని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.


