చెంచాడు పాలపొడి దొంగిలించాడని..... | 8-year-old, mother brutally beaten for stealing a spoon of milk powder | Sakshi
Sakshi News home page

చెంచాడు పాలపొడి దొంగిలించాడని.....

Jul 17 2015 9:21 AM | Updated on Sep 3 2017 5:41 AM

చెంచాడు పాలపొడి దొంగిలించాడని.....

చెంచాడు పాలపొడి దొంగిలించాడని.....

ఆగ్రాలో అమానుషం చోటు చేసుకుంది. పిల్లలకు పాఠాలు చెప్పే టీచరమ్మ తన ఇంట్లో పనిచేస్తున్న మహిళ కొడుకు నేరం చేశాడని ఆరోపిస్తూ ఎనిమిదేళ్ల పిల్లాడిని చావ చితక్కొట్టింది

ఆగ్రా:  ఆగ్రాలో అమానుషం చోటు చేసుకుంది. పిల్లలకు పాఠాలు చెప్పే టీచరమ్మ మానవత్వం మరిచి దుర్మార్గంగా  ప్రవర్తించింది.  తన ఇంట్లో పని చేస్తున్న మహిళ కొడుకు  నేరం చేశాడని  ఆరోపిస్తూ ఎనిమిదేళ్ల పిల్లాడిని చావ చితక్కొట్టింది. భర్తతో కలిసి తల్లీ కొడుకులపై  ఇనుపరాడ్లతో అమానవీయంగా దాడి చేసింది.

ఇంతకీ ఆ బాలుడు చేసిన  నేరం ఏమిటో తెలుసా.. ఒక  చెంచాడు పాల పౌడర్ను దొంగిలించడం...సీసీటీవీ ఫుటేజ్లో ఈ విషయాన్ని గమనించిన  దంపతులిద్దరూ, తల్లీకొడుకులపై  విచక్షణారహితంగా  దాడి చేసి, ఇనుపరాడ్లతో  నిర్దాక్షిణ్యంగా  కొట్టారు. అనంతరం వారి బట్టలు, ఇతర సామాగ్రిని లాక్కొని  ఇంట్లో నుంచి బైటికి గెంటేశారు. అంతేకాకుండా ఈ  విషయం ఎవరికీ చెప్పొద్దని  బెదిరించారు.  మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. దీనిపై బాధితుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు సరికదా...తమ పెట్రోల్ ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సిందిగా బాధితులను  వేధించారు.

తమ బట్టలు  లాగేసుకుని, చిన్నపిల్లాడని కూడా చూడకుండా  బిడ్డను విపరీతంగా కొట్టారని  బాధిత మహిళ వాపోయింది. ఈ విషయాన్ని ఎవరికైనా, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని  బెదిరించారని తెలిపింది. పాలపొడి దొంగిలించినందుకే పిల్లాడ్ని హింసించారని పోలీసు అధికారి చెప్పడం కొసమెరుపు. అయితే ఈ సంఘటనపై ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement