మంచు తుఫాన్‌లో నలుగురు సైనికుల మృతి

8 jawans stuck under snow after avalanche hits army post in Siachen - Sakshi

న్యూఢిల్లీ: సియాచిన్‌లోని ఉత్తర సెక్టార్‌లో సోమవారం మంచు తుఫాన్‌లో చిక్కుకుని నలుగురు సైనికులు, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 8 మంది సైనికులు సియాచిన్‌లో సుమారు 19 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మంచు తుఫాన్‌లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని గుర్తించి, వెలికి తీసేందుకు సహాయక బృందాలను సంఘటనాస్థలికి పంపామన్నారు. మంచు కింది చిక్కుకుపోయిన 8 మందిని వెలికి తీశామని, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే హెలికాప్టర్ల ద్వారా మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు వివరించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ నలుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు మరణించారని వెల్లడించారు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top