
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.