మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ | 57 Maoists, 297 Sympathisers Surrender In Chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

Oct 5 2016 9:29 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ - Sakshi

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

చత్తీస్ఘడ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

రాయ్పూర్: చత్తీస్ఘడ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో 57 మంది మావోయిస్టులు, 297 మంది సానుభూతి పరులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 17 మందిపై ఉన్న క్యాష్ రివార్డును వారికే అందిస్తామని, మిగతావారికి ప్రోత్సాహకంగా నగదును అందిస్తామని సుక్మా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ తెలిపారు.


లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు కెర్లాపాల్, మజిపరా, పొటాంపురా.బోర్గుడా, గొండ్ పల్లి మొసంపురా, జీరాంపల్, బాదేసట్టి, పొందుపరా గ్రామాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలో లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని ఎస్పీ  తెలిపారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 1,400 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement