
ఇస్తాంబుల్: ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో లిఫ్ట్‌లో తన తమ్ముడి ప్రాణాలను రక్షించిన సంఘటన ప్రస్తుతం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారందరూ ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూస్తే మీరూ మెచ్చుకోకుండా ఉండరేమో. ఇస్తాంబుల్‌లో ఇద్దరు చిన్నారులు తన సోదరుడితో కలిసి లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో బాలుడి కాలికి ఓ తాడు చుట్టుకొని ఉండగా దానిని గమనించకుండా అలాగే లిఫ్ట్‌లోకి వెళ్లారు. వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకోని పైకి వెళ్తుంటే తాడు చుట్టుకొని బాలుడు సైతం పైకి వెళ్లాడు.
ఇదంతా గమనించిన సోదరి కంగారు పడకుండా వెంటనే బాలుడి కాళ్లు పట్టుకొని కిందకు లాగి, తన చేతిని తాడు మధ్యలో ఉంచింది. మరో చేతితో అత్యవసర బటన్‌ను నొక్కింది. అనంతరం నెమ్మదిగా తన తమ్ముడిని తాడు నుంచి కిందకు లాగింది. ఈ దృశ్యమంతా లిఫ్ట్‌లోని సీసీ టీవిలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారి చూపించిన సమయస్ఫూర్తి గొప్పది’’ అంటూ కామెంట్ చేయగా ‘మరొకరు సోదరుడిని రక్షించడానికి అక్క చూపిన ధైర్య సాహసాలు గొప్పవి’ అంటూ పొగిడారు.
Horrifying moment! Sister stayed calm and saved the boy who got hang by toy rope inside an elevator in Istanbul, Turkey. Please watch your children when using elevator. pic.twitter.com/NmZ2x5VwyE
— People's Daily, China (@PDChina) August 1, 2019