
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే 39 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రభుత్వం, అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌కు తరలించారు. అయితే వారు ఎవరిని కలిశారో అనేది పోలీసులు, అధికారులకు సవాలుగా మారింది. వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించింది. వారిందరూ ప్లాస్మా చికిత్సకు స్పందిస్తున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకే 2376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. తాజా కేసులతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. అనుమానితులను వెంటనే గుర్తించి పరీక్షలు జరపాలని సీఎం ఆదేశించారు.