రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. | 3-Year-Old Raped, Survives Slit Throat In Ludhiana, Punjab | Sakshi
Sakshi News home page

రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం..

Mar 14 2016 10:43 AM | Updated on Sep 3 2017 7:44 PM

రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం..

రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం..

14 ఏళ్ల బాలుడు రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై చిన్నారి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు.

లుథియానా(పంజాబ్‌): 14 ఏళ్ల బాలుడు రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై చిన్నారి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన  పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో రైల్వే కాలనీలో సోమవారం వెలుగుచూసింది. అదే కాలనీలో కూరగాయలు అమ్మే బాలుడు చిన్నారిని ఆడుకుందామని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక ఎక్కడ చెబుతుందోనని భయపడిన అతడు ఇంట్లో  పదునైన కత్తితో బాలిక గొంతు కోశాడు. అనంతరం బాలుడు ఇంటి బయట వైపు తాళం వేసి పరారయ్యాడు.

కాగా, ఆడుకుందామని పిలిచి తన కూతురుపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాలికకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వైద్యుడు సంజీవ్‌ గుప్తా మాట్లాడుతూ.. బాలిక అత్యాచారానికి గురైనట్టు నిర్దారించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement