breaking news
Sanjeev Gupta
-
టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం..
Conflict of Interest Complaint Against MS Dhoni: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మెంటర్‌గా ఎమ్మెస్ ధోనిని నియమించడంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు అందింది. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ధోని నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాడు. లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఓ వ్యక్తి రెండు పదవులు ఎలా నిర్వహిస్తాడన్న విషయంపై సంజీవ్ గుప్తా స్పష్టత కోరారు. అయితే, దీనిపై అపెక్స్ కౌన్సిల్ తమ లీగల్ టీమ్‌ను సంప్రదించాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, ధోని ఇప్పటికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతను టీమిండియాకు మెంటర్‌గా కూడా ఎంపిక కావడంతో వివాదం మొదలైంది. కాగా, సంజీవ్ గుప్తా గతంలో కూడా ఆటగాళ్లపై ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదులు చాలా చేశాడు. చదవండి: టీమిండియాలో మరోసారి కరోనా కలకలం.. -
వర్క్ ఫ్రమ్ హోమ్: లండన్ టు అంగారకుడు
భూమి పైనుండి అంగారక పరిశోధనలు జరుపుతున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా.. బ్రిటన్ నుంచి అమెరికా మాత్రం ప్రయాణించలేకపోయారు! కారణం కరోనా నిబంధనలు. ప్రస్తుతం మార్స్ పైనున్న ‘పెర్సీ’ చేత రాళ్లు రప్పలూ, మట్టి ఎత్తించవలసింది ఆయనే. సంజీవ్ గుప్తా జియాలజిస్ట్. నాసా సైంటిస్ట్. ఎర్సీ టీమ్ మొత్తం కాలిఫోర్నియాలోని ‘జెట్ ప్రొపెల్షన్ లేబరేటరీ’ నుంచి పని చేస్తుంటే, ఆ టీమ్ సభ్యుడు అయిన సంజీవ్ ఒక్కరే సౌత్ లండన్ లోని ఒక అపార్ట్మెంట్ నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్నారు! తొమ్మిదేళ్ల తర్వాత పెర్సీ భూమి మీదకు తిరిగి వస్తుంది. అప్పటి వరకు ప్రొఫెసర్ సంజీవ్ (55) ఈ అపార్ట్మెంట్ లోనే 5 కంప్యూటర్ లు, 2 వీడియో కాన్ఫెరెన్సింగ్ స్క్రీన్ లతో 24 గంటలూ పనిచేస్తుంటారు. మార్స్ ది ఒక టైమ్ జోన్. కాలిఫోర్నియాది ఒక టైమ్ జోన్. సౌత్ లండన్‌ది ఒక టైమ్ జోన్. మూడు భిన్నమైన టైమ్ జోన్ల పర్మినెంట్ ‘జెట్ లాగ్’ నుంచి ఆయన్ని సేద తీర్చే మోనిటర్లు భార్యాపిల్లలే. ఇంతలా వర్క్‌ని, హోమ్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్న ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా ‘గ్రహస్తు జీవితం’ గురించి తెలుసుకోవలసిందే. దక్షిణ లండన్‌లోని ఒక అపార్ట్మెంట్లో దిగువ భాగాన ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్‌కు సరిగ్గా పై పోర్షన్లో ఉంటారు ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా. అక్కడి నుంచి ఆయన తన ఆఫీస్ వర్క్ చేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటిలో నుంచి ఆఫీస్ పని చేస్తున్నా, ఆయన చేస్తున్నది భూమి పై ఉన్న ఆఫీస్ పని కాదు. మార్స్ పని! వాడుక పలుకుబడిలో చెప్పాలంటే.. ఈ నెల 18న అంగారకుడిపై దిగిన రోవర్ ‘పెర్సీ’ చేత మట్టి తట్టలు మోయించే పనిలో ఉన్నారు సంజీవ్ గుప్తా! కేవలం మట్టి మాత్రమే కాదు. రాళ్లూ రప్పలు కూడా. పెర్సీ వాటిని చిన్న చిన్న మూటలు కట్టి ఉంచుతుంది. తిరిగి భూమిపైకి వచ్చేటప్పుడు తనతో పాటు ఆ మూటల్ని తెస్తుంది. ఆ తర్వాత వాటిని స్టడీ చేసే బాధ్యత కూడా సంజీవ్ గుప్తాదే. ఆయన జియాలజిస్టు. భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి ఒక్కటే కాదు. గ్రహాల ఉపరితలాల నేలల్ని, సముద్రాల అట్టడుగుల్నీ అధ్యయనం చేయగల నిపుణులు. నాసా సైంటిస్ట్. పెర్సీని అంగారకుడికి పంపడంలోని నాసా ఉద్దేశం తెలిసిందే. మానవ నివాస యోగ్యమైన వాతావరణం అక్కడ ఉందా లేదా, ఉండి ఉండేదా అని తెలుసుకోవడం. నాసా కోసం ప్రొఫెసర్ సంజీవ్ గుప్తా (55) ఉండవలసింది యూ.ఎస్‌లోనే అయినప్పటికీ బ్రిటన్ నుంచే పని చేస్తున్నారు. ఇండియా నుంచి వలస వెళ్లిన కుటుంబం వాళ్లది. గుప్తా లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్. యు.ఎస్. మార్స్ ‘పెర్సీ’ ప్రాజెక్ట్ బృందంలో ఆయన కీలక సభ్యుడు. భార్యా పిల్లలు లండన్‌లో ఉండటంతో వాళ్లతోపాటు సంజీవ్‌ను అక్కడే ఉండి ప్రాజెక్ట్ పని చేసేందుకు నాసా సమ్మతించింది. అందుకు అవసరమైన ఉపకరణాలను, టెక్నాలజీని ఆయన ఆపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసింది. ఐదు కంప్యూటర్లు, రెండు వీడియో కాన్ఫరెన్సింగ్ స్క్రీన్లు, మధ్య మధ్య భార్య అందించే టీ, టిఫిన్లు, భోజనం, కాఫీలతో ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది. నిద్రవేళల్ని కూడా మెల్లిగా ఆయన క్రమబద్ధం చేసుకోగలిగారు. అంగారకుడిపై ఉన్న రోవర్ కదలికల్ని అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మూడు వేర్వేరు ప్రాంతాల సమన్వయంతో నియంత్రిస్తూ ఉండవలసిన ఒక శాస్త్రవేత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందో ఊహించండి. పెర్సీ ఉన్నది మార్స్ మీద. పెర్సీ బృందం ఉన్నది కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో. ప్రొఫెసర్‌గారు ఉన్నది దక్షిణ లండన్‌లోని తన అపార్ట్మెంట్లో. మూడూ మూడు టైమ్ జోన్లు. ఒకసారి విమానయానం చేసొస్తేనే ‘జెట్ లాగ్’ అంటుంటారు. అలాంటి వివిధ టైమ్ జోన్లలో సంజీవ్ గుప్తా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఆ శక్తిని ఇస్తున్నది చేస్తున్న పని ధ్యాస మాత్రమే కాదు. భూమిపై ఆయన్నొక పెర్సీలా కనిపెట్టుకుని ఉంటున్న అర్ధాంగి కూడా. జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలో వందల మంది నాసా సైంటిస్టులు ల్యాప్‌టాప్‌లోకి కూరుకుపోయి గడియారాల్లా పని చేస్తుంటారు. వారందరితో ఏకకాలంలో గానీ, విడివిడి గానీ ప్రొఫెసర్ సంజీవ్ మాట్లాడవలసి ఉంటుంది. ఇది ఆయన కు పెద్దసంగతేమీ కాదు. ప్రస్తుతం ఆయన మానసికంగా 2030లో ఉన్నారు! భూమిపైకి పెర్సీ మణులు మాణిక్యాల్లాంటి మట్టి రాళ్లను తీసుకొచ్చే సంవత్సరం అది. 1,043 కిలోల బరువు గల ఆ రోవర్‌ను అంగారకుడిపై కదిలిస్తూ ఉండే శాస్త్రవేత్త ఒకరు. రీచార్జ్ చేస్తుండేవారొకరు. ప్రోగ్రామింగ్ చేస్తుండేవారు వేరొకరు. ఇలా పెర్సీ ప్రాజెక్ట్ టీమ్‌లో ప్రొఫెసర్ సంజీవ్ ఒకరు. ఏ రాయిని పడితే ఆ రాయిని, ఏ ధూళిని పడితే ఆ ధూళిని కాకుండా, జీవం కనుగొనేందుకు వీలైన వాటిని పెర్సీ చేతబట్టేలా చేయడం ఆయన ప్రధాన విధి. పెర్సీ దిగేందుకు ‘జెజెరో’ బిలాన్ని ఎంపిక చేసినవారిలో సంజీవ్ కూడా ఉన్నారు. సంజీవ్ గుప్తాకు 5 ఏళ్ల వయసులో ఆయన తల్లిదండ్రులు ఆగ్రా నుంచి బ్రిటన్ వలస వెళ్లారు. ఆయన తండ్రి కూడా రిసెర్చ్ సైంటిస్టే. అయితే తన కొడుకు మెడిసిన్ గానీ, మామూలు ఇంజినీరింగ్ గానీ చేయాలని ఆయన అనుకున్నారు. సంజీవ్ మాత్రం జియాలజీ వైపు ఆకర్షితులయ్యారు. ఆల్ప్ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయనే విషయమై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ‘సెయింట్ క్రాస్ కాలేజీలో’ సంజీవ్ పీహెచ్.డీ చేశారు. హిమాలయాలు, జర్మనీలోని ‘బ్లాక్ ఫారెస్ట్’ పర్వత శ్రేణులు, అట్లాంటిక్ సముద్ర గర్భంలోని అడుగు నేలలపైన కూడా సంజీవ్ గుప్తా అధ్యయనం జరిపారు. అంగారకుడిపై నీటి జాడలు ఉండేవని కానీ, ఉన్నట్లు లేవని ఈ ప్రపంచానికి నిర్థారణగా చెప్పగలవారు ప్రస్తుతానికైతే గుప్తా ఒక్కరే. అలాగని అందుకు తోడ్పడే పెర్సీ ‘మట్టిమూటల’ కోసం ఆయన మరో పదేళ్లు ఆగనక్కర్లేదు. ఈలోపే వేరొక మార్గంలో అంగారకుడి నుంచి భూమి పైకి ఆక్కడి మట్టి నమూనాలు చేరినా చాలు. వాటిని సంజీవ్ విశ్లేషిస్తారు. ‘వేరొక మార్గం’ అంటే.. ఇప్పుడు పెర్సీని అంగారకుడిపై వదిలి వచ్చిన వన్ టైమ్ రాకెట్ కాకుండా, భూమిపైకి తిరిగి వచ్చే రీ యూజబుల్ రాకెట్ అక్కడికి వెళ్లినప్పుడు పెర్సీ సేకరించిన నమూనాలను తీసుకురావడం. తెచ్చి సంజీవ్ చేతికివ్వడం. -
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేసులో ‘లిబర్టీ’...
లండన్: టాటా స్టీల్‌కు చెందిన యూకే వ్యాపారాలను భారత సంతతి వ్యాపార వేత్త సంజీవ్ గుప్తా లిబర్టీ హౌస్‌కు దాదాపు దక్కనున్నాయి. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కోసం నేడు(మంగళవారం) లిబర్టీ హౌస్ బిడ్ దాఖలు చేయనున్నది. ఈ విషయాన్ని కమోడిటీ ట్రేడింగ్ సంస్థ లిబర్టీ హౌస్ ధ్రువీకరించిందని ద ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కొనుగోలు విషయంలో సంజీవ్ గుప్తాకు జాన్ బోల్టన్ వంటి టాటా స్టీల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సలహాలు ఇస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. స్కాట్లాండ్లోని లిబర్టీ హౌస్ స్టీల్ వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూడ్డం కోసం గత నెలలో బోల్టన్ టాటా స్టీల్ నుంచివైదొలగి లిబర్టీ హౌస్‌లో చేరారు. ఇంగ్లాండ్‌లోని టాటా స్టీల్ ప్లాంట్లను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే నిధులను లిబర్టీ హౌస్‌కు అందించడానికి మాక్వెరీ క్యాపిటల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థతో పాటు ఎస్బీఐ, డెలాయిట్, గ్రాంట్ థార్న్టన్ తదితర సంస్థలతో లిబర్టీ హౌస్ సంప్రదింపులు జరపుతోంది. ఇక షెఫీల్డ్‌లో ఉన్న టాటా స్పెషాల్టీ స్టీల్స్ యూనిట్‌ను టోనీ పెడ్డర్ నేతృత్వంలోని అల్బియన్ స్టీల్ కంపెనీ బిడ్ చేయనున్నదని సమాచారం. -
రెండేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం..
లుథియానా(పంజాబ్): 14 ఏళ్ల బాలుడు రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై చిన్నారి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో రైల్వే కాలనీలో సోమవారం వెలుగుచూసింది. అదే కాలనీలో కూరగాయలు అమ్మే బాలుడు చిన్నారిని ఆడుకుందామని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక ఎక్కడ చెబుతుందోనని భయపడిన అతడు ఇంట్లో పదునైన కత్తితో బాలిక గొంతు కోశాడు. అనంతరం బాలుడు ఇంటి బయట వైపు తాళం వేసి పరారయ్యాడు. కాగా, ఆడుకుందామని పిలిచి తన కూతురుపై బాలుడు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. బాలికకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వైద్యుడు సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. బాలిక అత్యాచారానికి గురైనట్టు నిర్దారించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు. -
‘క్యూ’ దర్శకుడికి గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు
సాక్షి, విశాఖపట్నం: ‘క్యూ’ హిందీ చిత్ర దర్శకుడు, ఆగ్రాకు చెందిన సంజీవ్గుప్తాకు గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్ అవార్డు ప్రదానం చేయనున్నారు. సమకాలీన సమస్యలను ప్రతిబింబిస్తూ తీసిన ఈ చిత్రాన్ని జ్యూరీ ఎంపిక చేసిందని గొల్లపూడి మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సోమవారమిక్కడ తెలిపారు. ఆగస్టు 12న చెన్నైలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.