
శ్రీనగర్ : భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బిన్నర్‌లో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భధ్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గరు తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంఘటన స్థలంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.