ముండే-మహాజన్‌లకు ‘3’తో ముప్పు? | 3 number is not auspicious day for Pramod Mahajan, Gopinath Munde | Sakshi
Sakshi News home page

ముండే-మహాజన్‌లకు ‘3’తో ముప్పు?

Jun 4 2014 12:41 AM | Updated on Sep 2 2017 8:16 AM

ముండే-మహాజన్‌లకు ‘3’తో ముప్పు?

ముండే-మహాజన్‌లకు ‘3’తో ముప్పు?

గోపీనాథ్ ముండే, మహాజన్ కుటుంబాలకు 3వ అంకె చేటు తెచ్చిందా?

న్యూఢిల్లీ: గోపీనాథ్ ముండే, మహాజన్ కుటుంబాలకు 3వ అంకె చేటు తెచ్చిందా? ఎందుకంటే...కాకతాళీయమే అయినా ఆ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ముగ్గురి మరణాల్లో (ప్రమోద్ మహాజన్, ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్, గోపీనాథ్ ముండే) ఈ అంకె కనిపించడం ఈ భావనకు తావిస్తోంది. 
 
ప్రమోద్ మహాజన్: బీజేపీ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రమోద్ మహాజన్ తన సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో 2006 మే 3న మృతిచెందారు. .32 లెసైన్డ్ తుపాకీతో ప్రమోద్‌పై ప్రవీణ్ నాలుగుసార్లు కాల్పులు జరపగా అందులో మూడు తూటాలు ప్రమోద్ శరీరంలోకి దూసుకెళ్లాయి. 13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రమోద్ చివరకు తుదిశ్వాస విడిచారు.
 
ప్రమోద్ పీఏ: ప్రమోద్ మహాజన్ మృతి చెందిన నెలకు ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన వివేక్ మోయిత్రా ఢిల్లీలోని అధికార బంగ్లాలో 2006 జూన్ 3న అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.
 
ప్రవీణ్ మహాజన్: సోదరుడిని కాల్చి చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ప్రవీణ్ మహాజన్ 2010 మార్చి 3న బ్రెయిన్ హేమరేజ్‌కు చికిత్స పొందుతూ థానే ఆస్పత్రిలో కన్నుమూశారు.
 
గోపీనాథ్ ముండే: ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం (2014 జూన్ 3న) మృతిచెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement