ప్రాణాలు పోతుంటే.. సెల్ఫీల గోల | 3 Accident Victims Die in Rajasthan as Onlookers Take Selfies | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతుంటే.. సెల్ఫీల గోల

Jul 12 2018 3:30 AM | Updated on Sep 15 2018 4:05 PM

3 Accident Victims Die in Rajasthan as Onlookers Take Selfies - Sakshi

బర్మర్‌: సెల్ఫీల పిచ్చి మనుషుల్ని ఎంతలా దిగజార్చిందో తెలిపే ఘటన రాజస్తాన్‌లో జరిగింది. బర్మర్‌ జిల్లాలోని ఛోహ్‌టన్‌లో సోమవారం బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకుల్ని ఓ స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై రక్తపు మడుగులో పడున్న యువకులు నొప్పితో సాయం కోసం అర్థిస్తుంటే.. చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఘటనాస్థలంలో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేపనిలో పడ్డారు. ఏ ఒక్కరూ సాయంచేయలేదు. ఓ అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్షతగాత్రుల్లో ఒకరు ప్రమాదంజరిగిన చోటే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement