
ముంబయి : మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు ప్రభావంతో 20 మంది రైతులు మృత్యువాతపడ్డారు. మరో 700 మంది రైతులకు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. యావత్మాల్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు ప్రభావం కారణంగా మరో 25 మంది రైతులకు కంటి చూపు కూడా పోయిందని తెలుస్తోంది.
రోజుకు కేవలం రూ.200 నుంచి రూ.250ల కూలి వస్తుందని, దాంతో తమ జీవనం గడుస్తుందని ఆశతో వ్యవసాయం సాగని రైతులు, విధిలేక పనిబాటపట్టిన రైతులు పత్తి చేలల్లో పురుగుల మందు కొట్టే పనులకు వెళుతున్నారు. విదర్భ, యావత్‌మాల్ ప్రాంతాల్లోని వారంతా ఈ పనుల్లో నిమగ్నంకాగా ఆ పురుగుల మందు బారిన పడిని అనుకోని మరణాల బారిన పడుతున్నారు.