కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి | 20 dead after landslides in Assam | Sakshi
Sakshi News home page

కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి

Jun 2 2020 3:00 PM | Updated on Jun 2 2020 3:13 PM

20 dead after landslides in Assam - Sakshi

డిస్ పూర్ : అసోంలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతిచెందారు. మూడు వేర్వేరు చోట్ల మంగళవారం జరిగిన ఈ ప్రమాదాల్లో 20 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కరీమ్‌గంజ్ జిల్లాలోని కలియాగంజ్‌లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు, కాచర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు చనిపోయారు.



కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలపై అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement