బస్సు లోయలో పడి 13మంది మృతి | 13 die as bus falls in to gorge in Uttarakhand | Sakshi
Sakshi News home page

బస్సు లోయలో పడి 13మంది మృతి

May 7 2014 5:14 PM | Updated on Sep 2 2017 7:03 AM

ఉత్తరాఖండ్ లో దేవప్రయాగ వద్ద ఒక బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో 13 మంది చనిపోయారు.

ఉత్తరాఖండ్ లో దేవప్రయాగ వద్ద ఒక బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో 13 మంది చనిపోయారు. 27 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రోడ్ వేస్ కి చెందిన ఈ బస్సు ఢిల్లీ నుంచి గుప్త కాశీకి వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతుల భౌతికకాయాలను పోలీసులు తీసుకువచ్చారు. గాయపడిన వారిలో కొందరికి దేవ ప్రయాగలో, మరి కొందరికి రిషీకేశ్ లో చికిత్స చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందిని డెహ్రాడూన్ కి తీసుకువెళ్లారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement