ఉత్తరప్రదేశ్లో మొగల్ సరాయి ప్రాంతంలోని దుల్పూర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం రాత్రి కుప్పకూలింది.
చందౌలి: ఉత్తరప్రదేశ్లో మొగల్ సరాయి ప్రాంతంలోని దుల్పూర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని జిల్లా ఎస్పీ మునిరాజ్ ఆదివారం వెల్లడించారు. వారిలో నలుగురు కార్మికులు కాగా మిగిలిన వారు ఇంటి యజమానితోపాటు అతడి కుటుంబసభ్యులేనని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్ కే సింగ్ ప్రకటించారు.