గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు 11మంది మృతి చెందారు.
బనస్కాంతా(గాంధీనగర్): గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు 11మంది మృతి చెందారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు బనస్కాంతా జిల్లాలో నలుగురు, రాజ్కోట్, పాటాన్ జిల్లాల్లో ముగ్గురు, సబర్కంటా జిల్లాలో ఒక్కరు మృతిచెందారని అధికారులు తెలిపారు. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లపైనీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో మత్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.