ముంబై: ఎవరైనా పొగాకు ఉత్పత్తులను, గుట్కాలను కలిగిఉన్నా, వాటిని అమ్మినా పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ముంబై: ఇప్పటికే పొగాకు ఉత్పత్తులను, గుట్కాలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకనుంచి వీటిని ఎవరైనా కలిగి ఉన్నట్లుగుర్తించినా, అమ్మినా వారికి పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తామని హెచ్చరించింది. వీరందరిని ఐపీసీ సెక్షన్ 328(విష పదార్థాలతో హానీ చేయడం వంటి నేరాలు) కింద కేసులు నమోదు చేస్తామని ప్రకటించింది. ఇలాంటి కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా కూడా మారుస్తామని తెలిపింది.
వీటితోపాటు, వీటి విక్రయాలు జరుపుతున్న షాపులకు లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం గుట్కాల విక్రయాలు బాగా తగ్గిపోయాయని, వాటిని పూర్తిగా రూపుమాపేందుకు, మున్మందు అవి అందుబాటులో ఉండకుండా చేసేందుకే తాజాగా నిర్ణయాలు తీసుకోనున్నామనిన ప్రకటించింది. తమ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది.