
సాక్షి,న్యూఢిల్లీ: పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్థిక్ పటేల్‌పై ఓ యువతి చేసిన లైంగిక ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది. 24ఏళ్ల హార్థిక్ పటేల్‌పై ఫిర్యాదు అందిన క్రమంలో బాధితురాలిని స్వయంగా కలిసేందుకు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ సూరత్‌ను సందర్శిస్తారని సమాచారం.ఓ సెక్స్ సీడీలో పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ అభ్యంతరకరంగా కనిపించిన ఘటన అనంతరం ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూశాయి.
సీడీ వివాదంపై హార్థిక్ పటేల్ స్పందిస్తూ గుజరాత్ అభివృద్ధి సీడీని ప్రజలు చూడాలనుకుంటున్నారని..ప్రజలు కోరుకుంటున్నది 22 ఏళ్ల యువకుడి సీడీ కాదని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తనను అప్రతిష్టాపాలు చేసేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.
తనకు 2 కోట్లు ఇస్తే గుజరాత్ సీఎంపై కూడా సెక్స్ సీడీ చేయిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. నకిలీ సీడీతో తనను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని,త్వరలోనే తన నిజాయితీని నిరూపించుకుంటానని హార్థిక్ చెబుతున్నారు.