ప్రస్తుతం సినిమాలు తక్కువగా రావడానికి తనకు వచ్చే ప్రాజెక్టులు నచ్చకేనని స్పష్టం చేశారు పాకిస్తానీ నటి జరైన్ ఖాన్.
ముంబై: ప్రస్తుతం వెండితెరపై అవకాశాలు తక్కువగా రావడానికి తనకు వచ్చే ప్రాజెక్టులు నచ్చకేనని స్పష్టం చేశారు పాకిస్తానీ నటి జరైన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అవకాశాలు అరుదుగా రావడంపై స్పందించారు. 'నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.అయితే కథా పరంగా పాత్రలు నచ్చకే కొన్నింటిని వదులు కున్నాను. ఈ క్రమంలోనే చిత్రాల ఎంపికకు సమయం వెచ్చించాల్సి వస్తుందని, ప్రస్తుతం నా చేతిలో మంచి ప్రాజెక్టులు కూడా ఉన్నాయని' జరైన్ పేర్కొంది. తాజాగా విడుదలైన పంజాబీ ఫిల్మ్ మంచి లాభాల బాటలో పయనిస్తుందన్నారు.
తన ముందు ఇప్పుడు రెండు హిందీ చిత్రాలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉందని.. రెండోది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందన్నారు. 2012 లో వచ్చిన హౌస్ ఫుల్ 2 అనంతరం జరైన్ ఖాన్ కు అవకాశాలు సన్నగిల్లిన సంగతి తెలిసిందే.