బాహుబలి టీమ్‌లో... | Yuddham Sharanam release on 8 September | Sakshi
Sakshi News home page

బాహుబలి టీమ్‌లో...

Aug 22 2017 12:33 AM | Updated on Sep 17 2017 5:48 PM

బాహుబలి  టీమ్‌లో...

బాహుబలి టీమ్‌లో...

అక్కినేని నాగచైతన్య ‘బాహుబలి’ టీమ్‌లో వర్క్‌ చేశారట! నిజమా... ‘బాహుబలి’ రెండు భాగాల్లో చైతూ ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా? అయితే... చైతూ వర్క్‌ చేసింది యాక్టర్‌గా కాదు.

అక్కినేని నాగచైతన్య ‘బాహుబలి’ టీమ్‌లో వర్క్‌ చేశారట! నిజమా... ‘బాహుబలి’ రెండు భాగాల్లో చైతూ ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా? అయితే... చైతూ వర్క్‌ చేసింది యాక్టర్‌గా కాదు. మరేం చేశారు? అంటే... డ్రోన్‌ ఆపరేటర్‌గా వర్క్‌ చేశారట! చైతూ హీరోగా వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన సినిమా ‘యుద్ధం శరణం’. వచ్చే నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ డ్రోన్‌ ఆపరేటర్‌గా నటించిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటంటే... ‘బాహుబలి’కి వర్క్‌ చేసే డ్రోన్‌ ఆపరేటర్‌గా చైతూ కనిపిస్తారట. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ లైన్‌ ప్రొడ్యూసర్‌. ఆయనే ఇంట్రడక్షన్‌ సీన్స్‌లో హీరోని ‘బాహుబలి’ డ్రోన్‌ ఆపరేటర్‌గా చూపిస్తే బాగుంటుందనే ఐడియా ఇచ్చారట. అదీ మేటర్‌!! కృష్ణ ఆర్‌.వి. మరిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌గా, రావు రమేశ్, మురళీ శర్మ, రేవతి ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు రజనీ కొర్రపాటి నిర్మాత.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement