యుద్ధ భూమిలో...

yuddha bhoomi released on june 29 - Sakshi

భారత సరిహద్దుల్లో 1971లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మేజర్‌ రవి దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘1971: బియాండ్‌ బోర్డర్స్‌’. మోహన్‌లాల్, అల్లు శిరీష్, అరుణోదయ సింగ్‌ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమాను ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌తో జాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకాలపై ఏయన్‌ బాలాజీ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది.

‘‘1971లో భారత్‌–పాక్‌ బోర్డర్‌లో జరిగిన వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఎమోషనల్‌ డ్రామా ఈ చిత్రం. ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా మోహన్‌లాల్, డైనమిక్‌ సోల్జర్‌గా అల్లు శిరీష్‌ నటించారు. మేజర్‌ రవి సినిమాలు ఆర్మీ నేపథ్యంలో ఉంటూనే యువతలో దేశభక్తిని కలిగిస్తాయి. ఇంతకుముందు నేను తెలుగులోకి అనువదించిన తమిళం, హిందీ, మలయాళ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ‘యుద్ధభూమి’ కూడా సక్సెస్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సెన్సార్‌ పూర్తి చేశాం’’ అన్నారు నిర్మాత బాలాజీ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top