రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

Young Directors Interest To Movie With Heroine Raai Laxmi - Sakshi

తమిళసినిమా: నటి రాయ్‌లక్ష్మి చిత్రానికి తోడ్పాటు అందించడానికి ఆ ఇద్దరు దర్శకులు ముందుకొచ్చారు. రాయ్‌లక్ష్మి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం అని భావించనక్కర్లేదు. సంచలనాలకు చిరునామా ఈ భామ. అందాలారబోతకు వెనుకాడని నటి. అలాంటి నటి సినిమాల్లో కనిపించి చాలాకాలం అయ్యింది. నీయా–2 చిత్రం తరువాత ఈ అమ్మడి చిత్రమేదీ తెరపైకి రాలేదు. నటిగా మాత్రం రాయ్‌లక్ష్మి బిజీగానే ఉంది. అలా నటిస్తున్న వాటిలో సిండ్రిల్లా చిత్రం ఒకటి. ఈ పేరు వినగానే దేవతల ఇతి వృత్తంతో కూడిన చిత్రాలు గుర్తుకొస్తాయి. రాయ్‌లక్ష్మి నటించిన సిండ్రిల్లా మాత్రం వేరేగా ఉంటుంది. హారర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని దర్శకుడు వినో వెంకటేశ్‌ చెప్పారు. 

మల్టీమీడియా చదివిన ఈయన బెంగళూర్‌కు చెందిన వారు. కొంతకాలం దర్శకుడు ఎస్‌జే.సూర్య వద్ద సహయ దర్శకుడిగా పనిచేశారు. సిండ్రిల్లా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సిండ్రిల్లా చిత్రం గురించి దర్శకుడు చెబుతూ.. ఇది ఒక దెయ్యం కథేనన్నారు. ఇటీవల వస్తున్న దెయ్యం కథా చిత్రాలకు పూర్తిభిన్నంగా ఉంటుందన్నారు. కథ, కథనాలు ఉత్కంఠభరితంగా సాగుతాయని తెలిపారు. ఇందులో నటి రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిందన్నారు. ఇది ఆమె గ్లామర్‌ ఇమేజ్‌ను బ్రేక్‌ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిండ్రిల్లా నటి రాయ్‌లక్ష్మి కేరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ఇప్పటి వరకూ గ్లామరస్‌ రాయ్‌లక్ష్మిని చూసిన ప్రేక్షకులకు ఈ చిత్రంలో పూర్తి భిన్నంగా చూస్తారన్నారు. నటి సాక్షీ అగర్వాల్‌ ప్రతినాయకిగా విభిన్న పాత్రలో నటించినట్లు చెప్పారు. ఆమె పోషించిన పాత్ర తెరపై సెగలు పుట్టిస్తుందన్నారు. 

ఈ చిత్రానికి ‘కాంచనా–2’ ఫేమ్‌ అశ్వమిత్ర సంగీతాన్ని, లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ చిత్రానికి ఛాయాగ్రహణ అందించిన రామి ఈ చిత్రానికి పని చేసినట్లు తెలిపారు. సిండ్రిల్లా పేరుతో హాలీవుడ్‌లో పలు చిత్రాలు వచ్చాయని, సిండ్రిల్లా పేరు పిల్లలకు బాగా ఇష్టం అనీ అన్నా రు. తమ సిండ్రిల్లా చిత్రం ఆబాలగోపాలాన్ని అలరిస్తోందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పుడు ప్రేక్షకులు స్టార్స్‌ను చూడడం లేదని, కథ, కథనాలను చెప్పే విధానాన్ని చూస్తున్నారని తెలిపారు. ఆ విధంగా సిండ్రిల్లా చిత్రాన్ని మంచి కాలక్షేప అంశాలతో రూపొందించామన్నారు. ప్రేక్షకులు కచ్చి తంగా ఆదరిస్తారనే నమ్మ కం ఉందన్నారు. మరో విషయం ఏమిటంటే సిండ్రిల్లా చిత్ర టీజర్‌ను సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, దర్శక, నటుడు ఎస్‌జే.సూర్య కలిసి శనివారం ఆన్‌లైన్‌లో ఆవి ష్కరించినట్లు తెలిపారు. టీజర్‌కు విపరీతంగా లైక్‌లు వస్తుండడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top