నయన్‌ తరువాత కెనడా మోడల్‌తో.

Yogi Babu Romance With Canada Model - Sakshi

సినిమా: తమిళ సినిమాలో ప్రస్తుతం హాస్య నటుడు యోగిబాబు అంత బిజీ నటుడు మరోకరు లేరన్నది వాస్తవం. అంతే కాదు ఆయనంత లక్కీ నటుడు ఇంకోకరు లేరనే చెప్పాలి. అగ్రనటి నయనతారతో రొమాన్స్‌ చేయడానికి చాలా మంది యువ నటులు కలలు కంటుంటే కొలమావు కోకిల చిత్రంలో యోగిబాబు ఆమెను పిచ్చపిచ్చగా ప్రేమించే యువకుడిగా నటించి మెప్పించాడు. తాజాగా ఒక కెనడా మోడల్‌తో నటించడానికి రెడీ అవుతున్నాడు. అవును ఈయన గూర్ఖా అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇందులో ఆయనతో కెనడాకు చెందిన ప్రముఖ మోడల్‌ ఎలిస్సా నటించనుంది. శ్యామ్‌ ఆంటన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ అమెరికాతో సహా పలువురు మోడల్స్‌ను పరిశీలించి చివరికి కెనడా మోడల్‌ ఎలిస్సాను ఎంపిక చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఆడిషన్‌లో చెప్పింది అర్థం చేసుకుని చక్కగా నటించి ఎలిస్సా ఈ అవకాశాన్ని దక్కించుకుందన్నారు.

అయితే అందరూ ఊహించుకున్నట్లు ఎలిస్సా నటుడు యోగిబాబుకు జంటగా నటించడం లేదని, వీరి మధ్య రొమాన్స్‌ సన్నివేశాలు ఉండవని  చెప్పారు. డిశంబరులో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్ర యూనిట్‌ రిహార్సల్స్‌లో ఉందని చెప్పారు. ఇందులో కుక్క ముఖ్య పాత్రను పోషించనుందని తెలిపారు. దీన్ని 4 మంకీస్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించనుంది. మరికొందరు ప్రముఖ నటీనటులు నటించనున్న ఈ చిత్రానికి కృష్ణన్‌ వసంత్‌ ఛాయాగ్రహణం, రూపన్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర నటీనటులను, సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈయన ప్రస్తుతం నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న 100 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top