4ఏళ్లుగా యోగా చేస్తున్నా: అల్లు శిరీష్ | yoga is good for human body says allu shireesh | Sakshi
Sakshi News home page

4ఏళ్లుగా యోగా చేస్తున్నా: అల్లు శిరీష్

Jun 21 2015 8:40 AM | Updated on Sep 3 2017 4:08 AM

4ఏళ్లుగా యోగా చేస్తున్నా: అల్లు శిరీష్

4ఏళ్లుగా యోగా చేస్తున్నా: అల్లు శిరీష్

ఆరు పలకల దేహం అంటే అబ్బాయిలకు ఎంతో మోజు. ఇక, సినిమా హీరోలైతే ఏదైనా పాత్ర డిమాండ్ చేస్తే.. వెనక్కి తగ్గకుండా సిక్స్ ప్యాక్ చేసేస్తారు.

హైదరాబాద్: ఆరు పలకల దేహం అంటే అబ్బాయిలకు ఎంతో మోజు. ఇక, సినిమా హీరోలైతే ఏదైనా పాత్ర డిమాండ్ చేస్తే.. వెనక్కి తగ్గకుండా సిక్స్ ప్యాక్ చేసేస్తారు. ఇటీవల అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ చేశారు. తన శరీరం ఎంత ఫిట్‌గా ఉందో చూపించడానికి సామాజిక మాధ్యమం ద్వారా కొన్ని ఫొటోలు బయటపెట్టారు కూడా. శిరీష్ ఫిట్‌నెస్ చూసినవాళ్లు సూపర్బ్ అంటున్నారు. ఇంతకీ.. ఈ ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు.

వ్యాయామాలే కారణం కూడా కొంతమంది ఫిక్సయ్యారు. కానీ, కేవలం వ్యాయామాలే కాదు.. ఇంత ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి ఓ కారణం 'యోగా' అంటున్నారు అల్లు శిరీష్. దీని గురించి ఆయన విపులంగా చెబుతూ నాలుగేళ్ల నుంచీ యోగాసనాలు ప్రాక్టిస్ చేస్తున్నా. వ్యాయామాలకు మించిన బలాన్నిస్తోంది యోగా. వ్యాయామం కేవలం దేహదారుఢ్యాన్ని పెంచుతుంది. కానీ యోగా మనలో అంతర్లీనంగా దాగున్న ఎన్నో శక్తులను మేల్కొల్పి ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఈ తరం వారికి యోగా చాలా అవసరం కూడా. ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి కొత్త గుర్తింపు తెచ్చింది యోగా అన్నారు అల్లు శిరీష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement