స్టార్ హీరో సినిమాలు మానేస్తున్నాడా..! | Will not do films as favour to anyone from this time, says Sanjay Dutt | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో సినిమాలు మానేస్తున్నాడా..!

Mar 19 2016 11:58 AM | Updated on Apr 3 2019 6:23 PM

స్టార్ హీరో సినిమాలు మానేస్తున్నాడా..! - Sakshi

స్టార్ హీరో సినిమాలు మానేస్తున్నాడా..!

ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్.

న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్. ఆయన శనివారం నాడు బాంబు లాంటి వార్త పేల్చారు. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2016లో పాల్గొన్న సంజయ్ ఇకపై సినిమాల విషయంలో ఎలా ఉండబోతున్నాడో వివరించాడు. తొలుత ఈ వార్త విన్న వారంతా సంజూ బాయ్ సినిమాలు తీయరేమోనని ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు.

తన పిల్లలు ఇఖ్రా, షాహ్రాన్ ల స్కూలు ఫంక్షన్లకు హాజరవుతున్నానని చెప్పాడు. తాను జైలుకు వెళ్లినప్పుడు వారికి కేవలం రెండేళ్లేనని, తాను ఎన్నో వేడుకలలో పాల్గొనలేకపోయానని ఈ సీనియర్ హీరో బాధపడ్డాడు. ఇప్పటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితేనే చేయాలని నిర్ణయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు సంజయ్. ప్రస్తుతం సిద్ధార్థ ఆనంద్, విధు వినోద్ చోప్రా, మున్నాబాయ్ 3 మూవీ ప్రాజెక్టుల కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే 'మున్నాబాయ్ 3' షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమం అవుతుందని చెప్పుకొచ్చాడు సంజయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement