భార్య భయపెడితే? | Wife i first look release | Sakshi
Sakshi News home page

భార్య భయపెడితే?

Jul 14 2019 12:31 AM | Updated on Jul 14 2019 12:31 AM

Wife i first look release - Sakshi

సాక్షి నిదియా, అభిషేక్‌ రెడ్డి

భార్యాభర్తల మధ్య ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ప్రేమ, అసూయ, ద్వేషాలు, ఎప్పటికో కనిపించే ప్రేమ. దానిలో నుంచి పొంగుకొచ్చే రొమాన్స్‌... ఇవన్నీ మించితే వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే పాయింట్‌తో ‘వైఫ్‌.ఐ’ చిత్రాన్ని తెరకెక్కించాం అని చిత్రబృందం తెలిపింది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో టెంప్ట్‌ రవిగా ఫేమస్‌ అయిన అభిషేక్‌ రెడ్డి, సాక్షి నిదియా జంటగా నటించిన చిత్రం ‘వైఫ్‌.ఐ’. జి.ఎస్‌.ఎస్‌.పి కల్యాణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.చరితా రెడ్డి నిర్మాత. ‘‘మనిషి అనే ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఆ తప్పు ఏంటో తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మా సినిమా ఫస్ట్‌ లుక్‌ అందర్నీ ఆకట్టుకుంది. సినిమా విజయంపై యూనిట్‌ ధీమాగా ఉన్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం:వినోద్‌ యాజమాన్య.
 

Advertisement
 
Advertisement
Advertisement